వివేకా హత్య కేసు.. ఢిల్లీ వెళ్లిన సీబీఐ బృందం

by srinivas |
వివేకా హత్య కేసు.. ఢిల్లీ వెళ్లిన సీబీఐ బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కడప నుంచి ఢిల్లీకి వెళ్లారు.

తొలుత రెండు వారాల ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు.. కడప, పులివెందులలో విచారణ చేపట్టారు. వివేకా కుమార్తె సునీత, వైసీపీ నేత శివశంకర్ రెడ్డి, ఏపీ కృష్ణా రెడ్డి, విచారించారు. అనంతరం కడప జైలులో వివేకానందరెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లాను అధికారులు విచారించారు. తాత్కాలిక విరామం తీసుకున్న అధికారులు.. మళ్లీ విచారణ ఎప్పుడు మొదలుపెడుతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story