- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హత్రాస్ ఘటనలో సీబీఐ చార్జ్‌షీట్
హత్రాస్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ అత్యాచారం, హత్య ఘటనలో సీబీఐ శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గత సెప్టెంబర్‌లో దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి, క్రూరంగా హింసించి హత్య చేసిన విషయం విధితమే. ఘటన జరిగిన మూడు నెలల అనంతరం నలుగురు నిందితులపై గ్యాంగ్ రేప్, హత్యతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలను సీబీఐ మోపింది. సెప్టెంబర్ 14న దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన నలుగురు అత్యాచారం జరిపి, తీవ్రంగా హింసించారు. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆ యువతి మృతిచెందింది.
సెప్టెంబర్ 30న రాత్రిపూట పోలీసులు యువతి అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదమైంది. కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కానీ, కుటుంబ సభ్యుల అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దర్యాప్తు జరిపిన సీబీఐ మూడు నెలల తర్వాత చార్జ్ షీట్ దాఖలు చేసింది.