- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోసపూరితంగా రుణం.. ఆ సంస్థపై సీబీఐ కేసు
దిశ, వెబ్‌డెస్క్: మోసపూరితంగా రుణం తీసుకున్నారంటూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఫిర్యాదు మేరకు త్రినేత్ర ఇన్‌ఫ్రా వెంచర్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో ఆస్తులు తనఖా పెట్టడమే కాకుండా వాటి విలువను కూడా ఎక్కువగా చూపించి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై త్రినేత్ర సంస్థపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆస్తులను తనిఖీ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఆ ఆస్తులకు సంబంధించిన యాజమాన్య హక్కులు సరిగా లేకపోవడంతోపాటు తనఖా సమయంలో వాటి విలువను ఎక్కువగా చేసి చూపించినట్లు నిర్ధారించారు. తీసుకున్న రుణంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ.11.77 కోట్ల మేర మోసం జరిగినట్లు ఐఎఫ్‌ఎసీ న్యాయాధికారి అనామిక రావత్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో త్రినేత్ర ఇన్‌ఫ్రా వెంచర్ లిమిటెడ్ ఎండీ పీవీవీఆర్‌ఎల్‌ఎన్ ప్రసాద్‌తో పాటు సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.