HYD GST కమిషనరేట్ : లంచం రికార్డులు బ్రేక్ 

by Anukaran |   ( Updated:2023-08-20 15:37:24.0  )
HYD GST కమిషనరేట్ : లంచం రికార్డులు బ్రేక్ 
X

దిశ వెబ్ డెస్క్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ లో భారీ అవినీతికి పాల్పడిన అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసింది. పన్ను ఎగవేత నిరోధక భాగంలో ఇద్దరు అవినీతి తిమింగలాలు ఆధారాలతో సహా సీబీఐ చేతికి చిక్కారు. హైదరాబాద్ GST కమిషనరేట్ లో ఉన్నతాధికారులైన సుధారాణి, బొల్లినేని శ్రీనివాస గాంధీ లపై సిబిఐ కేసు నమోదు చేసింది.

వీరిద్దరూ ఇన్‌పుట్‌ క్రెడిట్ ను మంజూరు చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల నుండి ఐదు కోట్లు లంచాన్ని డిమాండ్ చేసినట్టు అభియోగాలు వెల్లడవుతున్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీ మీద సిబిఐ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ భారీ అవినీతి వ్యవహారం బయటపడింది.

బొల్లినేని శ్రీనివాస గాంధీ గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయనపై సిబిఐ కేసు నమోదవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం అందుతోంది.

Advertisement

Next Story

Most Viewed