- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Phone Tapping Case: మరో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో బీఆర్ఎస్(BRS) నేతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్(Jaipal Yadav)కు నోటీసులు ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు సైతం హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా, రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇలాంటి తరుణంలో.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం, ఆ వెంటనే మరో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడం, ఇవాళ ఆయన కూడా విచారణకు హాజరు కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి నెక్ట్స్ ఎవరికి నోటీసులు జారీ చేస్తారు? ఎవరెవరికి ఈ కేసులో ప్రమేయం ఉందోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది.