TTD : ఆన్ లైన్ ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

by Y. Venkata Narasimha Reddy |
TTD : ఆన్ లైన్ ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్లు, డైరీలు
X

దిశ, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీడీడీ శుభవార్త తెలిపింది. శ్రీవారి భక్తులకు ఆన్ లైన్ ద్వారా టీటీడీ(TTD)2025 డైరీలు, క్యాలెండర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చైర్మన్ బీఆర్.నాయుడు(B.R. Naidu)ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్, సింగల్ షీట్ క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చైర్మన్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచిందన్నారు.

ఆఫ్ లైన్ లో తిరుమల, తిరుపతి, తిరుచానూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తారని పేర్కొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా గతంలో లాగే డోర్ డెలివరీ పొందే సౌలభ్యం కొనసాగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చని, నిర్ణయించిన ధరలకే విటిని విక్రయిస్తున్నారన్నారు. ఈ సౌకర్యాన్ని వెంకన్న భక్తులు వినియోగించుకోవాలని చైర్మన్ బీఆర్.నాయుడు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed