- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India-USA: భారత్- అమెరికా (India-USA) రక్షణ సంబంధాలపై స్పందించిన పెంటగాన్
దిశ, నేషనల్ బ్యూరో: భారత్- అమెరికా (India-USA) రక్షణ సంబంధాలపై పెంటగాన్ స్పందించింది. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం అయ్యాయని, అద్భుతంగా ముందుకు సాగుతున్నాయని ఇండో పసిఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ అన్నారు. ‘అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు మెరుగయ్యాయి. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించింది. ఇది అద్భుతమైన, ఉత్తేజకరమైన మార్గాల్లో వేగంగా పురోగమిస్తోంది’ అని తెలిపారు.
ఇటీవలే డ్రోన్ల ఒప్పందం
ఇటీవల 31 ఎంక్యూ-9బీ ప్రీడేటర్ డ్రోన్లను తక్కువ మొత్తంలో అందించేందుకు అమెరికా (USA) ముందుకొచ్చింది. అంతేకాకుండా, ఇరుదేశాల మధ్య పలు రక్షణ పరికరాల సరఫరాకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య రక్షణకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. రక్షణ సంబంధిత చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నేతలు పేర్కొన్నారు.