హత్య కేసులో దోషిగా డేరాబాబా… తేల్చేసిన సీబీఐ కోర్టు

by Shamantha N |
హత్య కేసులో దోషిగా డేరాబాబా… తేల్చేసిన సీబీఐ కోర్టు
X

దిల్లీ: రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరాబాబాను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. గతంలో డేరాబాబా ఆశ్రమంలో మేనేజర్‌గా రంజిత్‌ సింగ్‌ పనిచేశారు. 2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న దోషులకు సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో డేరాబాబా శిక్ష అనుభవిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed