జగన్ బెయిల్‌ రద్దుపై సీబీఐ కోర్టు విచారణ వాయిదా

by srinivas |
MP Raghu Ramakrishnam Raju
X

దిశ, ఏపీబ్యూరో: వైఎస్‌జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రఘురామరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడంతో సీఎం జగన్‌తో పాటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేశాయి. జగన్‌ కౌంటర్‌పై రఘురామ రిజాయిండర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు చేశారని ఆరోపించారు. తనకు పిటిషన్‌ వేసే అర్హత లేదనడం అసంబద్ధమన్నారు. పిటిషన్‌ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టత ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

తనపై కేవలం ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదయ్యాయని, ఛార్జ్‌షీట్‌లు కాలేదన్నారు. సీబీఐలోని కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారని అందువల్లే సీబీఐ ఎలాంటి వైఖరి వెల్లడించలేదని ఆరోపించారు. ప్రచారం కోసమే పిటిషన్‌ వేశానన్న ఆరోపణలు నిరాధారమన్న ఆయన తాను పిటిషన్‌ వేయగానే సీఐడీ తనపై కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. చట్ట విరుద్ధంగా తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. దీనిపై వాదనలు వినిపించేందుకు జగన్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు విచారణను వచ్చేనెల 1కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed