- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా ఐటీ రీఫండ్ చెల్లింపులు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) సెప్టెంబర్ 1 నాటికి మొత్తం 26.2 లక్షల మందికి రూ. 98,625 కోట్లను రీఫండ్ చేసినట్టు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వాపసులను త్వరగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో, దాదాపు 24.5 లక్షల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ. 29,997 కోట్ల పన్ను వాపసును జారీ చేశారు.
1.68 లక్షల మంది కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ. 68,628 కోట్ల వాపసును జారీ చేసినట్టు సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను సంబంధిత సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. గతంలో పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ ఈ-మెయిల్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని కోరింది.
ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల నుంచి వేగంగా ప్రతిస్పందన రావడంతో రీఫండ్‌లను త్వరగా ప్రాసెస్ చేయడానికి వీలవుతోందని సీబీడీటీ తెలిపింది. ఈ మొత్తం కూడా డిజిటల్ చెల్లింపుల్లో జరిగాయని, పన్ను చెల్లింపుదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు సీబీడీటీ వెల్లడించింది.