మాంసం తినే చేప .. మనుషుల్ని కూడా తింటదంటా

by Shyam |   ( Updated:2021-04-15 01:41:34.0  )
మాంసం తినే చేప .. మనుషుల్ని కూడా తింటదంటా
X

దిశ, వెబ్ డెస్క్ : చేపల్ని పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. అయితే చేపలు చెరువులలో ఉండే నాచుని తిని జీవిస్తాయి. కానీ మనుషుల్ని తినే చేపలు, తోటి చేపల్ని, జీవులు కూడా తినే చేపలు ఉంటాయి. అది ఏ చేప అనుకుంటున్నారా.. క్యాట్ ఫిష్ జాతికి చెందిన చేప. ఇది మాంసం తిటుంది. పాము కదా తన పిల్లలని తాను తిన్నట్టు ఈ చేప కూడా తన తోటి చేపల్ని తింటుంది. అలానే జీవుల్ని చివరకు మనుషుల మాంసాన్ని కూడా తింటుందట.

అయితే ఈ వింత చేప తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ఇది నలుపు తెలుపు చారలు కలిగి ఉంటుంది. ఇలాంటి చాపలు సముద్రలాలో, కాలువలలో చాలా అరుదుగా ఉంటాయని, ఇలాంటివి సముద్రంలో చెరువులలో ఉన్నా ప్రమాదమేనని అధికారులు అంటున్నారు. ఈ అరుదైన చేప పశ్చిమ బెంగాల్ కు దగ్గరగా ఉండే ఈ రకం చేపలు, కోల్​కతా నుంచి ఆక్వా సీడ్​లో కలిసిపోయి ఆంధ్రాకి వచ్చాయని వివరించారు. ఇది సుమారు 50 అంగుళాలు పొడవు కలిగి ఉంటుంది.దీన్ని నదులు, చెరువుల్లో కనిపిస్తే చంపేస్తారు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇది మనుషులు తినడానికి కూడా ఉపయోగపడదు.

Advertisement

Next Story