- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లికి సోకిన కరోనా
దిశ, వెబ్‌డెస్క్:
కొన్ని వారాల క్రితం హాంకాంగ్‌లో ఒక కుక్కకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్క వయసు ఎక్కువ కావడంతో రెండ్రోజుల్లో చనిపోయింది. ఇప్పుడు కొత్తగా బెల్జియంలోని ఓ పిల్లికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. యజమానురాలు నుంచి పిల్లికి కొవిడ్ సోకినట్లు బెల్జియం వైద్యులు ధ్రువీకరించారు.
ఈ మేరకు మొదటి మనిషి నుంచి జంతువుకు కరోనా వ్యాప్తి చెందిందని బెల్జియం పబ్లిక్ హెల్త్ అధికారులు స్పష్టం చేశారు. యజమానురాలితో కలిసి ఉత్తర ఇటలీ నుంచి తిరిగొచ్చిన తర్వాత పిల్లికి డయేరియా, వాంతులు, శ్వాస ఇబ్బందులు వచ్చాయి. పిల్లి శాంపిళ్లను వైద్యులకు పంపిన తర్వాత వారు పరీక్ష చేసిన కొవిడ్ అని తెలిపారు. అయితే ఈ పిల్లి కోలుకుంటోందని వైరాలజిస్ట్ స్టీవెన్ చెప్పారు. అయితే పిల్లులు, కుక్కలకు మనుషుల నుంచి వ్యాపిస్తుందనడంలో ఇప్పటికీ స్పష్టత లేదని, ఈ పిల్లికి డైరెక్టుగా కూడా వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. గతంలో సార్స్ వైరస్ కూడా కుక్క, పిల్లులకు సోకినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదని, కరోనా విషయంలో కూడా అలాగే జరిగితే పరిస్థితి నియంత్రణలోనే ఉంటుందని ఆయన వెల్లడించారు.
Tags: Corona, COVID 19, Cat, Dog, positive, Italy