పైలెట్‌పై దాడిచేసిన పిల్లి.. విమానం అత్యవసర ల్యాండింగ్

by vinod kumar |   ( Updated:2021-03-04 21:20:29.0  )
cat attacks pilot
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పిల్లి ఎదురొస్తే అపశకునం అంటుంటారు. శుభమా అని బయటకు వెళ్తుంటే మాయదారి పిల్లి ఎదురొచ్చిందని తిట్టుకుంటారు జనాలు. అయితే పిల్లి ఎదురురావడం వల్ల ప్రయాణాలు వాయిదా వేసి వారి గురించి చూశాం. దీని వెనక శాస్త్రీయత ఏంటనే విషయం కాసేపు పక్కనపెడితే.. ఇక్కడొక పిల్లి కారణంగా ఏకంగా ఆకాశంలో దూసుకుపోతున్న విమానమే కిందికి దిగాల్సి వచ్చింది. అదేంటి.. విమానానికి కూడా పిల్లి ఎదురొచ్చిందా..? అని అనుకుంటున్నారా..? కాదు కాదు. ఏకంగా విమానం నడిపే వ్యక్తి మీదే దాడికి దిగింది.

వివరాల్లోకెళ్తే.. ఖతార్‌కు చెందిన విమానమొకటి ఖార్టోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. విమానం పూర్తి స్థాయిలో పైకి ఎగిరి అప్పుడే స్పీడ్ అందుకుంటున్న సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో ఏమో గానీ ఒక పిల్లి కాక్‌పిట్ లోకి ప్రవేశించింది. విమానం నడుపుతున్న పైలెట్ మీద దాడికి దిగింది. అతడి మీద పడి పులిలా దాడికి దిగడంతో పైలెట్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో అతడు ఏవియేషన్ అధికారులకు సమాచారం అందించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

ఇది కూడా చదవండి : స్టెప్పేసిన తాజా, మాజీ సీఎంలు.. వీడియో వైరల్

అయితే ఆ పిల్లి కాక్‌పిట్ లోకి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ సస్పెన్సే. విమానాన్ని శుభ్రం చేసే సమయంలో పిల్లి అందులోకి వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై సదరు విమాన సంస్థ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Advertisement

Next Story