- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం వహిస్తే కేసులు
దిశ, హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు పిడుగు లాంటి వార్త అందించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ రోడ్ల పైకి వచ్చిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ మరుసటి రోజు 23వ తేదీ సోమవారం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైయివేటు సంస్థలు మూతపడ్డాయి. ఈ నిబంధనలను అనుసరించి రోడ్లపై వాహనాలు తిరగడం, పౌరులు సంచరించడాన్ని నిషేధించారు. అయితే లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ వాహనాలు తిరగడం సాధారణ రోజులనే తపించాయి. పోలీసులు ప్రజలకు ఎన్ని సార్లు చెప్పిన అనేక సాకులు చెబుతూ రోడ్ల పైకి వచ్చారు. నగరంలోని లక్షా 78 వేల సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించిన 1,21,785 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిలో టూ వీలర్ వాహనాలు 93393, త్రీ వీలర్ వాహనాలు 988. ఫోర్ వీలర్ వాహనాలు.5041 ఉన్నాయి. వీరందిరిపై వయోలేషన్ యాక్ట్ కింద ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన 13,249 టూవీలర్ వాహనాలు, 1999 త్రీ వీలర్ వాహనాలు, 1372 ఫోర్ వీలర్ వాహనాలు మొత్తం 16651 వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పటివరకూ 5029 టూవీలర్ వాహనాలు, 471 త్రీ వీలర్ వాహనాలు, 243 ఫోర్ వీలర్ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.
Tags: case, neglect, lockdown, motorists, hyderabad. coronavirus