- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో 23 వేలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. వైరస్ ప్రబలకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి, అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీని బారినపడుతున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. అలాగే, వైరస్ సోకి చనిపోతున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1684 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 37 మరణాలు సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 23,077కు చేరగా, మృతిచెందిన వారి సంఖ్య 718కి పెరిగిందని తెలిపింది.
దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ వైరస్ ప్రభావం మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా 6,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదై, 283మంది మృతిచెందగా, ఒక్క ముంబైలోనే 4,025 కేసులు, 167 మరణాలు సంభవించడం గమనార్హం.
Tags: corona, cases in india, lockdown, india, positive cases,central governament, corona deaths