- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేటలో రెచ్చిపోతున్న చిట్ ఫండ్ మాఫియా
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో చిట్ ఫండ్ మాఫియా రెచ్చిపోతోంది. సంవత్సరాల తరబడి పైసా పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బును సమయానికి ఇవ్వకుండా ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. చిట్టి డబ్బులు అడిగిన పాపానికి.. ఖాతాదారులపై ఏకంగా దాడులకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కుక్కడపు శ్రీనివాస్ అక్షర చిట్ ఫండ్‌లో గత 42 నెలల కాలంలో రూ.10 లక్షల చిట్టిని కట్టి పూర్తి చేశాడు. గత నాలుగు నెలలుగా డబ్బులు కావాలని వారి చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వకుండా సాకులు చెబుతుండటంతో శ్రీనివాస్ కుటుంబసమేతంగా వెళ్లి గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన చిట్‌ఫండ్ సిబ్బంది, శ్రీనివాస్ కుటుంబంపై దాడికి దిగారు. ఈ దాడిలో శ్రీనివాస్, నరేందర్‌లకు గాయాలు కాగా శ్రీకాంత్ చేతి నరం తెగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాంత్‌ను హైదరాబాద్ తరలించారు.
చర్యలు తీసుకోవాలి
దాడులకు పాల్పడ్డ అక్షర చిట్ ఫండ్ నిర్వాహకులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తనకు రావాల్సిన నగదు ఇప్పించాలని బాధితుడు శ్రీనివాస్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.