ఈటల రాజేందర్‌పై కేసు నమోదు?

by Sridhar Babu |
Etela
X

దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈటలతోపాటు ఆయన అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగళవారం హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తలు కరీంనగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈటలతోపాటు ఆయన అనుచరులు పాల్గొన్నారు. అయితే, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు ఈటలపై, ఆయన అనుచరులపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story