బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు..!

by Anukaran |   ( Updated:2020-09-07 05:50:01.0  )
బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు..!
X

దిశ వెబ్‎డెస్క్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‎ రాష్ట్ర ద్వారాహత్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగితో పాటు ఆయన భార్యపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మహేశ్ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని.. ఆయన కారణంగా ఓ పాపకు జన్మనిచ్చానని ఆగస్టు 16వ తేదీన ఓ మహిళలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఎమ్మెల్యే దంపతులపై ఐపీసీ 376 (ఆత్యాచారం), 506 (నేరపూరిత కుట్ర) కింద కేసులు నమోదు చేసినట్లు నెహ్రూ కాలనీ పోలీసులు తెలిపారు. అయితే ప్రతిపక్షనేతల కుట్రలతోనే తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే మహేశ్ నేగి అన్నారు.

Advertisement

Next Story