అభయ ఆసుపత్రిపై కేసు నమోదు..

by Sumithra |
అభయ ఆసుపత్రిపై కేసు నమోదు..
X

దిశ, నల్లగొండ : పట్టణంలోని ప్రకాశం బజార్‌లో ఉన్న అభయ ఆసుపత్రి యాజమాన్యం కరోనా చికిత్సలకు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం రోగులకు అందించిన చికిత్సల విషయంలో ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ ఎస్.ఎం. బాషా, డిప్యూటి డీఎంహెచ్ఓ‌లతో కలిసి అభయ ఆసుపత్రిని తనిఖీ చేశారు.

ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి రిజిస్టర్‌లు నిర్వహించకుండా కరోనా చికిత్సలు చేస్తూ కరోనా రోగుల వద్ద రోజుకు రూ.30 వేల వరకు వసూలు చేస్తూ.. పేద ప్రజల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా, వారిని మోసం చేస్తున్నట్లుగా గుర్తించామని తెలిపారు. ఎలాంటి బిల్స్ ఇవ్వనందున అభయ ఆసుపత్రి యాజమాన్యం చంద్రహసన్ రెడ్డి, వెంకటేశ్వర్లలపై కేసు నమోదు చేసినట్లు నిగిడాల సురేష్ తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఇలాంటి సమస్యలపై, అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, అవసరమైతే డయల్ 100 ద్వారా సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed