పెట్రోల్ పోసి చంపుతామంటూ ఎమ్మార్వోకు వార్నింగ్

by Shyam |
పెట్రోల్ పోసి చంపుతామంటూ ఎమ్మార్వోకు వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
తమ పని చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంగా తహసీల్దార్‌‌నే చంపుతామంటూ బెదిరింపులకు గురిచేశారు ఇద్దరు ప్రబుద్దులు. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవకొండ మండలంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. దేవరకొండ తహసీల్దార్ కిరణ్మయిని పెట్రోల్ పోసి చంపుతామంటూ కార్యాలయంలోనే ఇద్దరు వ్యక్తులు బెదిరించారు. భూమి పట్టా మార్పిడి విషయంలో జాప్యం జరగడంతో దేవరకొండ మండలం వెంకటతండా సర్పంచ్ కుమారుడు, భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఎమ్మార్వోకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు సమాచారం అందించింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు వక్తులను విచారించారు. విచారణలో కూడా వారు దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed