కంగనాపై కేసు నమోదు

by Jakkula Samataha |
కంగనాపై కేసు నమోదు
X

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు నమోదు అయింది. దేశంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా తన సోదరి రంగోలి చందేల్ పోస్ట్ లు పెట్టడంతో ట్విట్టర్ అకౌంట్ ను సస్పెండ్ చేయగా… తనకు సపోర్ట్ చేస్తూ ఓ వీడియో పెట్టింది కంగనా. దీంతో ముంబై కి చెందిన అడ్వకేట్ అలీ కాశిఫ్ ఖాన్ కంగనా పై కేసు పెట్టారు. సోదరి హింస, చంపడం గురించి మాట్లాడితే… కంగనా మద్దతు తెలపడం కూడా ఒక రకంగా నేరమే అని చెప్పాడు. రంగోలి చందెల్ తనకున్న స్టార్ డం, ఫాలోయింగ్, మనీ, పవర్, పరపతిని ద్వేషం, హింసను ప్రమోట్ చేయడానికి వినియోగిస్తుంది అన్నారు.

ఇక రంగోలి చందేల్ ట్విట్టర్ అకౌంట్ ను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ పోస్ట్ చేసిన వీడియోలో… తన సోదరి డాక్టర్లు, పోలీసుల మీద దాడి చేసిన వారిని చంపేయాలని పోస్ట్ పెట్టిందని… ఈ విషయాన్ని వక్రీకరిస్తూ ఫరా అలీ ఖాన్, రీమా కగ్తి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడింది. రంగోలి ఒక మతాన్ని టార్గెట్ చేస్తుందని తప్పుడు ప్రచారం చేశారు అని ఆరోపించింది. దేశం ప్రస్తుతం సమస్యను ఎదుర్కుంటోంది… ఇలాంటి సమయంలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ పూర్తిగా తీసేయలని డిమాండ్ చేసింది. కాగా గతంలోనూ కంగనా పై కేసు పెట్టాడు అడ్వకేట్ అలీ కాశిఫ్ ఖాన్.

Tags : Kangana Ranaut, Rangoli Chandel, Bollywood, Farah Ali Khan , Ali kaashif Khan

Advertisement

Next Story