ఉల్లంఘనులపై పోలీసుల కొరడా

by Shyam |   ( Updated:2020-04-24 06:29:59.0  )
ఉల్లంఘనులపై పోలీసుల కొరడా
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సూర్యాపేట జిల్లా పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మునగాల మండలంలో నిబంధనలు అతిక్రమించిన 64 మందిపై కేసు నమోదు చేసి, 126 బైకులు సీజ్ చేసినట్టు ఎస్సై కే సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరో 54 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags: suryapet, lockdown, vehicle seized, case, police

Advertisement

Next Story

Most Viewed