లాక్‌డౌన్ ఉల్లంఘన.. 14 మందిపై కేసు

by Sumithra |

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘించిన 14మందిపై గద్వాల పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టణంలోని మోమిన్ మహల్లాలోని‌ వీధుల్లో అనవసరంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని, క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు స్థానిక సీఐ జక్కుల హనుమంతు తెలిపారు. కంటైన్మెంట్ జోన్‌లో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దన్నారు‌. కరోనా రాకుండా ప్రజలు ఇండ్లకే పరిమితమై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags : Case, 14 persons, violating, lockdown, mahaboobnagar, gadwala

Advertisement

Next Story