- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యాక్సిన్ తయారీకి ఏడాదిన్నర పట్టొచ్చు : సౌమ్య విశ్వనాథన్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సిన్ అభివృద్దికి ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్యా విశ్వనాథన్ అన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు అధిక సమయం వెచ్చించడమే అందుకు కారణమన్నారు. 74 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం సౌమ్యా విశ్వనాథన్‌ను శనివారం చెన్నైలో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె విలేకరులతో ముచ్చటించారు.
కరోనా సంక్షోభం మొదలై ఇప్పటికే 6 నెలలు గడచింది.కరోనాను టీకా సిద్దం చేసినట్లు రష్యా ఇప్పటికే ప్రకటించగా.. చాలా దేశాలు దానిపై ఆశలు పెట్టుకున్నాయి. ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. భారత్ విషయానికొస్తే వివిధ కంపెనీలు 7 కరోనా టీకాలపై పరిశోధన సాగిస్తున్నాయి. కాగా, సాధారణ సమయంలో ఓ టీకా తయారీకి 5 నుంచి 10ఏండ్ల సమయం పడుతుందని సౌమ్యా విశ్వనాథన్ వివరించారు. డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇతర సంస్థలు, కరోనా వ్యాక్సిన్ తయారీ సమయాన్ని1.5 ఏళ్లకు కుదించే ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టంచేశారు.