జనగామ వాసికి కరోనా లక్షణాలు..ఐసోలేషన్‌కు తరలింపు

by Shyam |
జనగామ వాసికి కరోనా లక్షణాలు..ఐసోలేషన్‌కు తరలింపు
X

దిశ, వరంగల్ :

ఢిల్లీలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని వచ్చిన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన వ్యక్తి ఎండీ ఖాజామియాకు కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే అధికారులు అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఖాజామియా ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని మార్కజ్ ప్రార్ధన మందిరంలో జరిగిన సభకు హాజరయ్యాడు. ఈ నెల 18న కాజీపేటకు చేరుకుని తన స్వగ్రామమైన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండకు చేరుకున్నాడు. ఖాజామియా మటన్ వ్యాపారి. అక్కడి నుంచి వచ్చాక 2సార్లు మటన్ విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. వెల్దండ గ్రామంలో ఇతని వద్ద మటన్ కొనుగోలు చేసిన వారందరిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు కోరారు. దాదాపు 35 మందికి పైగా ఇళ్లకు నోటీసులు అంటించారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Tags: carona, suspeted shifted to isolation ward, lockdown, warngal

Advertisement

Next Story

Most Viewed