పోలీసుల అదుపులో కరోనా అనుమానితుడు

by srinivas |   ( Updated:2020-03-21 04:16:50.0  )
పోలీసుల అదుపులో కరోనా అనుమానితుడు
X

ముంబైలోని క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు వచ్చిన కరోనా అనుమానితుడిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..ఈనెల దుబాయి నుంచి ముంబై వచ్చిన యువకుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అతన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్యం అందజేశారు. అదే సమయంలో అధికారుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆపై తన సొంత జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. ఈక్రమంలోనే అతడి చేతికి ఉన్న ముద్రను చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ ముద్ర ఏంటని ఆరా తీయడంతో ఆ యువకుడు కంగారు పడ్డాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు అతడిని వెంటనే బస్సు నుంచి కిందికి దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags: carona suspected, dubai, mumbai, hud, lb nagar police, west godavari

Advertisement

Next Story