- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ జిల్లాల్లోనే కరోనా మరణాలు అధికం..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రికవరీ రేటు పెరుగుతున్నా మరణాలు కూడా ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలోని పలురాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో పాటు , మరణాల శాతం కూడా తక్కువగానే ఉంది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మరణాలు అధికంగా ఉన్న జిల్లాల లిస్టులో రాష్ట్రంలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 16 జిల్లాల్లో కరోనా మరణాలు అత్యధికంగా ఉన్నాయి. ఆయాచోట్ల యాక్టివ్ కేసులు అధికంగా ఉండటంతో పాటు రోజువారీ కేసులు కూడా పెరుగుతున్నాయి. టెస్ట్‌ల సంఖ్య మాత్రం తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
కరోనా కేసులతో పాటు మరణాలు ఎక్కువగా ఉన్నజిల్లాలు ఎవి అంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్.. కర్ణాకటలోని బెలగావి, బెంగళూరు అర్బన్, కల్బుర్గి , ఉడిపి.. తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, రాణి పేట్, తెని, తిరువల్లూర్, తిరుచిరాపల్లి, తుటికోరిన్, విద్యానగర్.. తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాల రేటు ఉండటం ఆందోళనను కలిగిస్తోందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులతో హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.