జాగ్రత్త పడితే కరోనాకు దూరం..

by Shyam |
జాగ్రత్త పడితే కరోనాకు దూరం..
X

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. పూర్తిగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ వైరస్‌ దరిచేరకుండా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. చేతులను తరుచూ శుభ్రంగా కడుక్కోవాలి, చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండాలి. కళ్లు, ముక్కును చేతులతో నులుముకోకుండా ఉండటంతో పాటు షేక్ హ్యాండ్‌కు దూరంగా ఉండాలి. బాధితుడి నోటి తుంపర్ల ద్వారా వ్యాధి సోకే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మిత్రులను అయినా తాకకుండా తూరంగా ఉండి సమస్కారం చేసి మాట్లాడాలి, దగ్గర నుంచి మాట్లాడుకుంటే వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవాలి. పరిశుభ్రతే కరోనావైరస్‌కు శాశ్వత పరిష్కారం చూపుతుందని వైద్యాధికారులు తెలుపుతున్నారు.

Tags: coronavirus, Careful distance, doctor, Beware, Wash hands

Advertisement

Next Story

Most Viewed