బీసీ బిల్లు ఆమోదం సంతోషకరం.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

by Sumithra |
బీసీ బిల్లు ఆమోదం సంతోషకరం.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
X

దిశ, మక్తల్ : అసెంబ్లీలో బీసీ కులగణన బిల్ ఆమోదం లభించడం సంతోషకరమైన విషయమని. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ వ్యక్తి కాకున్నా బీసీ బిల్లు ఆమోదం కోసం ఆయన పడిన తపన ప్రశంషనీయమని మక్తల్ ఎమ్మెల్యేవాకిటి శ్రీహరి ఫోను ద్వారా" దిశ "కు తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనా విధానాన్ని అమలు పరుస్తున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. చట్ట సభల్లో బీసీల సంఖ్య పెరిగేందుకు సరైన సమయం ఆసన్నమైందని తెలిపారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ సంఖ్య ఎంత అని యువకుల్లో ఆలోచించే తరుణం వస్తుందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల గురించి ఎంతో ముందుచూపుతో ఆలోచించి, కులగణన చేపట్టారని అన్నారు. పార్లమెంట్లో బిల్లు సాధించుకునేందుకు అక్కడ పక్షుల నాయకులు అందరూ కలిసి పోరాటం చేయాలని ఆయన అన్నారు.

Next Story

Most Viewed