- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mahesh Babu: నువ్వు దేవుడివి సామి! 4500+ చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేశ్ బాబు

దిశ, డైనమిక్ బ్యూరో: సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనలో నైనా, సమాజసేవలో నైనా బాబు ముందు ఉంటారు. చిన్న పిల్లలకు సంబంధించి ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తారు.. కానీ చేసే సేవలను ప్రచారం చేసుకోరని అభిమానులు చెబుతుంటారు. అయితే ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్రీగా 4500 లకు పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేపించారు. నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్లు విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్ వేడుకలకు హాజరయ్యారు. అంతేకాక ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్ తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రత ప్రారంభించారు. అందులో ఆమె మహేష్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని తెలిపారు.
కాగా, చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించి గతంలో మహేష్ బాబు బాలకృష్ణ షోకు వచ్చిన సందర్భంగా వివరించారు. తన కొడుకు గౌతమ్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ట్రీట్‌మెంట్ చేయించామన్నారు. అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది.. లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నామని మహేష్ బాబు షో చెప్పారు. ప్రస్తుతం 4500+ చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నువ్వు నిజంగా దేవుడివి సామి అంటూ నెటిజన్లు సుపర్ స్టార్ మహేశ్‌బాబును కొనియాడుతున్నారు.
Read More..
ఒకే ఏడాది అత్యధిక ట్యాక్స్ చెల్లించిన సెలబ్రెటీగా అమితాబ్.. ఎంతంటే?