UGC NET 2024:యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల..పరీక్ష ఎప్పుడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-04-21 11:55:49.0  )
UGC NET 2024:యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల..పరీక్ష ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: పొస్టుగ్రాడ్యుషన్ పూర్తి చేసిన వారు మరియు పీజీ చివరి ఏడాది చదువుతున్న వారికి యూజీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పీజీ తర్వాత యూనివర్శిటిలో లెక్చరర్ షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం UGC NET 2024 జూన్ సెష‌న్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. యూజీసి నెట్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభ‌మైంది. కాగా అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. మొత్తం 83 సబ్జెక్టులకు గాను పరీక్ష అన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా జూన్ 16వ తేదీన NTA ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మే 12వ తేదీన రాత్రి 11.50 గంటల వరకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 13 నుంచి 15 వరకు సరిచేసుకోవచ్చు.

పీజీలో క‌నీసం 55శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైన‌వారు ఈ పరీక్ష‌కు అప్ల‌య్ చేసుకోగ‌ల‌రు. ఈ పరీక్ష‌ను దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష ఏడాదిలో రెండు సార్లు నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్య‌ర్థులు రూ. 1150 చెల్లించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్) అభ్య‌ర్థులు రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్రూ అభ్య‌ర్థులు రూ. 325 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ ని సంప్రదించండి.

Advertisement

Next Story