గ్రూప్ -2,3,4 /SI, కానిస్టేబుల్ ప్రత్యేకం: జాగ్రఫీ క్రిష్ణా నది ఉపనదులు

by Hajipasha |   ( Updated:2023-01-26 13:52:06.0  )
గ్రూప్ -2,3,4 /SI, కానిస్టేబుల్ ప్రత్యేకం: జాగ్రఫీ క్రిష్ణా నది ఉపనదులు
X

ఎడమవైపు నుంచి కలిసేవి

1. భీమా నది – మహబూబ్‌నగర్

2. డిండి నది – నాగర్‌ కర్నూల్

3. మూసీ నది – వికారాబాద్

4. హాలియా నది – నల్లగొండ

5. పాలేరు నది – జనగామ

6. మున్నేరు నది – వరంగల్ (రూరల్)

కుడివైపు నుంచి కలిసేవి

1. తుంగభద్ర – కర్నూలు

2. బుడమేరు – ఒంగోలు

3. తమ్మిలేరు – ఒంగోలు

4. రామిలేరు – ఒంగోలు

5. ఘటప్రభ – కర్ణాటక

6. మలప్రభ – కర్ణాటక

7. దూద్‌గంగా – మహారాష్ట్ర

8. పంచ్‌గంగా – మహారాష్ట్ర

9. కొయనా – మహారాష్ట్ర

10. యెన్నా – మహారాష్ట్ర

ఉపనదుల జన్మస్థానాలు

1. భీమా నది

-మొత్తం పొడవు: 861 కి.మీ.

-ప్రవహించే రాష్ట్రాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ

-జన్మస్థలం: పశ్చిమ కనుమల్లో (మహారాష్ట్ర) పశ్చిమాన ఉన్న భీమశంకర కొండలు.

-ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ.. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో రాయచూర్‌కు ఉత్తరాన కృష్ణానదిలో కలుస్తుంది.

భీమా నది ఉపనదులు

-కాగ్నా, మూల, ఇంద్రాణి

గమనిక: -కాగ్నానది: ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పడమర వైపు జన్మించి తెలంగాణలో ప్రవహిస్తూ కర్ణాటకలో ప్రవేశించి బీమా నదిలో కలుస్తుంది.

-భీమానది కృష్ణా నది ఉపనదుల్లోకెల్లా అతి పొడవైనది.

2. డిండి నది (మీనాంబరం)

-మొత్తం పొడవు: 152 కి.మీ.

-ప్రవహించే జిల్లాలు: మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ.

-జన్మస్థలం: మహబూబ్‌నగర్ జిల్లాలోని షాబాద్ కొండలు

-ఈ నది షాబాద్ కొండల్లో జన్మించి మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూలు, నల్లగొండ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఏలేశ్వరం (నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలో) వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

-ఇది కృష్ణానదికి ఎడమవైపు నుంచి కలుస్తున్న ఉపనది.

3. మూసీ నది (ముచ్‌కుందా నది)

-మొత్తం పొడవు: 250 కి.మీ.

-ప్రవహించే జిల్లాలు: వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ.

-జన్మస్థలం: వికారాబాద్ జిల్లా శివారెడ్డి పేట వద్ద ఉన్న అనంతగిరి కొండలు.

-ఈ నది వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల గుండా ప్రవహిస్తూ.. నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

-మూసీనది కృష్ణానదికి ఎడమవైపు నుంచి కలిసే ఉపనది.

-మూసీనది ఒడ్డున ఉన్న పట్టణం: హైదరాబాద్

-తెలంగాణలో కృష్ణానదిలో కలిసే చివరి ఉప నది: మూసీ

మూసీ ఉపనదులు

-ఈసీ, ఆలేరు, సకల వాణి.రిజర్వాయర్లు

1. ఉస్మాన్‌సాగర్

-మూసీనదిపై 1920లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, గండిపేట వద్ద ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీన్ని గండిపేట రిజర్వాయర్ అంటారు.

-ఇది హైదరాబాద్ పాత నగరానికి తాగునీటిని అందిస్తుంది.

2. హిమాయత్‌సాగర్

-మూసీ ఉపనది అయిన ఈసీ నదిపై మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో (1927లో) ఆయన పెద్ద కొడుకు హిమాయత్ అలీఖాన్ పేరుమీద హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌ను (రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ గ్రామంలో) నిర్మించారు.

-ఇది కృత్రిమ రిజర్వాయర్.

-ఇది మూసీ నది వరదలను నియంత్రించడంతోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తుంది. మూసీనదికి భారీ వరదలు వచ్చిన ఏడాది- 1908.

3. హుస్సేన్‌సాగర్

-మూసీ ఉపనది అయిన ఆలేరు నదిపై మీర్ హుస్సేన్‌షావర్ అలీఖాన్ కాలంలో (1562లో) హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల సరిహద్దులో హుస్సేన్‌సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు.

-ఇది హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలను కలుపుతుంది.

-ఆలేరు నది హైదరాబాద్-సికింద్రాబాద్‌లను వేరుచేస్తుంది.

-ఆలేరు నది చింతలూరు వద్ద మూసీనదిలో కలుస్తుంది.

4. హాలియా నది

-ఈ నది నల్లగొండ జిల్లాలో జన్మించి, నల్లగొండ జిల్లాలోనే (అటవీ ప్రాంతంలో) కృష్ణానదిలో కలుస్తుంది.

5. పాలేరు నది

-మొత్తం పొడవు: 152 కి.మీ.

-ప్రవహించే జిల్లాలు: జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, కృష్ణా.

-జన్మస్థలం: జనగామ జిల్లాలోని చాణకపురం.

-అక్కడి నుంచి ఈ నది జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహిస్తూ.. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.

7. తుంగభద్ర నది

-మొత్తం పొడవు: 531 కి.మీ.

-ప్రవహించే రాష్ట్రాలు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.

-జన్మస్థలం: పశ్చిమ కనుమల్లోని (కర్ణాటకలో) వరాహ పర్వతాలు.

-వరాహ పర్వతాల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్‌మంగుళూరు జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడింది.

-తదనంతరం తుంగభద్ర నది కర్ణాటక గుండా ప్రవహిస్తూ కర్నూలు జిల్లాలోని కొసిగి ప్రాంతం వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి, కర్నూలు జిల్లా గుండా ప్రవహిస్తూ మంత్రాలయం ఎగువన తెలంగాణలో గద్వాల జిల్లా అలంపూర్‌లోకి ప్రవేశించి, తిరిగి కర్నూలు జిల్లాలో ప్రవేశించి నల్లమల అటవీ ప్రాంతంలో సంగెం (సంగమేశ్వరం) వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

-ఈ నది కృష్ణా నది ఉపనదులు కెల్లా పెద్దది.

-తుంగభద్ర తీరంలోని ముఖ్యమైన ఆలయాలు

-రాఘవేంద్రస్వామి ఆలయం – మంత్రాలయం (కర్నూలు)

-జోగులాంబ దేవాలయం – ఆలంపూర్ గద్వాల

-తుంగభద్ర నదిపై హోస్పేట వద్ద నీటి పారుదలకు, జల విద్యుత్ కోసం ఆనకట్టను నిర్మించారు. అదేవిధంగా కర్ణాటకలో తుంగభద్ర నదిపై ఆల్మట్టి డ్యామ్‌ను నిర్మించారు.

ఉపనదులు

-వరద, హగరి (హంద్రీనీవా), వేదవతి, కుముద్వతి (కుందా నది), పంపానది

-బుడమేరునదిని ఆంధ్ర దుఃఖదాయని అని పిలుస్తారు.

-చిత్ర ఆనంద్ కుమార్, సీనియర్ ఫ్యాకల్టీ..హైదరాబాద్.

Advertisement

Next Story