- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
TG PGECET 2024: పీజీఈసెట్.. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు!
by Geesa Chandu |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఆయా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 9454 సీట్లుండగా.. 7128 మందికి సీట్లు అలాట్ అయ్యాయని కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అడ్మిషన్ కు 10,923 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నా.. కొందరికీ సీట్లు అలాట్ కాలేదన్నారు. ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో 5891 సీట్లుంటే.. 4330 మందికి, ఎంఫార్మసీలో 3395 సీట్లుంటే.. 2747మందికి సీట్లు అలాట్ అయినట్టు చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 19 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని కన్వీనర్ స్పష్టంచేశారు.
Advertisement
Next Story