- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ పాలిటీ: రాష్ట్ర శాసన సభ/ విధాన సభ
స్టడీ మెటీరియల్:రాష్ట్ర శాసన శాఖలో దిగువ సభను విధాన సభ/ శాసన సభగా పిలుస్తారు.
విధాన సభ గూర్చి వివరించే నిబంధన – 170.
విధాన సభ కనీస సభ్యుల సంఖ్య – 60
విధాన సభ గరిష్ట సభ్యుల సంఖ్య – 500.
ప్రస్తుతం దేశంలో అత్యధిక శాసనసభ సభ్యులను కల్గివున్న రాష్ట్రం – ఉత్తరప్రదేశ్ (403)
దేశంలో అతి తక్కువ శాసనసభ సభ్యులను కలిగివున్న రాష్ట్రం – సిక్కిం (32)
పార్లమెంట్ చట్టం ప్రకారం తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు శాసనసభ కనీస సభ్యుల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది.
3 రాష్ట్రాలకు కనీస సభ్యుల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది- (1) సిక్కిం – 32 (2) గోవా – 40 (3) మిజోరాం – 40
పార్లమెంట్ చట్టం ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 2026 వరకు పెరగవు.
332 నిబంధన ప్రకారం శాసన సభ నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి.
అర్హతలు:
భారతీయ పౌరుడై ఉండాలి.
కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలు 5,000, ఇతరులు 10,000 రూ.లను డిపాజిట్ చేయాలి.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠ వ్యయ పరిమితి 25 లక్షలు.
ఎన్నిక విధానం:
శాసనసభ ఎన్నికలను నిర్వహించేది భారత ఎన్నికల సంఘం.
శాసనసభ సభ్యులను ఎన్నుకునేది వయోజనులు.
శాసన సభా ఎన్నికలను ప్రత్యక్ష, ఎన్నికలు అంటారు.
పార్టీ ప్రాతిపదిక మీద శాసనసభ ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – ప్రొటెం స్పీకర్ లేదా స్పీకర్.
తొలి సమావేశానికి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – ప్రొటెం స్పీకర్.
ఇతరులు చేత ప్రమాణ స్వీకారం చేయించేది – స్పీకర్.
పదవీకాలం:
శాసనసభ సభ్యుల పదవీకాలం – 5 సంవత్సరాలు.
వాస్తవంగా శాసన సభ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు.
174వ నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభలో విశ్వాసం కలిగిన ముఖ్యమంత్రి సూచన మేరకు శాసనసభను రద్దు చేస్తారు.
శాసన సభ పూర్తికాలం కొనసాగి రద్దు అయినట్లయితే 6 నెలలలోపు కొత్త శాసనసభను ఏర్పాటు చేయాలి.
స్పీకర్:
శాసన సభకు అధిపతి – స్పీకర్
శాసన సభ సంరక్షకుడు – స్పీకర్
సాధారణంగా స్పీకర్ అధికార పార్టీకి డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష పార్టీకి చెంది ఉంటారు.
రాజ్యాంగ ప్రకారం శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు వర్తించకుండా ఉండడానికి పదవిని చేపట్టిన వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికై రాజీనామా చేయాలి.
రాష్ట్ర కేబినెట్ మంత్రి కంటే ఎక్కువ హోదా గౌరవం స్పీకర్‌కు ఉంటుంది.
శాసనసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించేది.
ప్రోటెం స్పీకర్ – ప్రోటెం స్పీకర్‌ను తాత్కాలిక స్పీకర్‌గా పిలుస్తారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ప్రోటెం స్పీకర్‌ను నియమిస్తారు.
ప్రొటెం స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది – గవర్నర్ –
ప్రొటెం స్పీకర్ కు 2 రకాలైన అధికారాలు ఉంటాయి. అవి: 1. తొలి సమావేశానికి అధ్యక్షత వహించి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 2. శాసన సభ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు.
స్పీకర్ ఎన్నిక విధానం.. పదవీకాలం
రాజ్యాంగం ప్రకారం స్పీకర్‌ను ఎన్నుకునేది శాసనసభా సభ్యులు.
సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
రాజ్యాంగం ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ప్రమాణ స్వీకారం ఉండదు.
సంప్రదాయంగా శాసనసభలో గల అధికార పక్ష నాయకుడు & ప్రతిపక్ష నాయకుడు గౌరవంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను పదవి వద్దకు తీసుకువస్తారు.
రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవి కాలం – 5 సంవత్సరాలు.
స్పీకర్ రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు ఇవ్వాలి.
ఏ కారణం చేతనైనా స్పీకర్ పదవి ఖాళీ అయితే 6 నెలల లోపు భర్తీ చేయాలి.
డిప్యూటీ స్పీకర్ తాత్కాలిక స్పీకర్‌గా 6 నెలలకు మించకుండా పనిచేస్తారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సమావేశానికి అధ్యక్షత వహించేది ప్యానెల్ స్పీకర్.
ప్యానెల్ స్పీకర్స్ సంఖ్య – 6.
స్పీకర్ అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్లయితే 14 రోజుల ముందస్తు నోటీతో అవిశ్వాస తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెడతారు.
శాసనసభలో అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరిగే రోజు స్పీకర్ సమావేశానికి అధ్యక్షత వహించకూడదు.
స్పీకర్ సమావేశానికి హాజరై ఓటింగ్ లో పాల్గొనవచ్చు.
శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే స్పీకర్ పదవి నుండి తొలగించబడతారు.
శాసన శాఖ అధికారాలు
రాష్ట్ర శాసనశాఖ అధికారాలను క్రింది విధంగా పేర్కొనవచ్చును. అవి:
1. శాసన అధికారాలు
రాష్ట్ర శాసన శాఖ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో గల అంశాల పైన శాసనాలను తయారు చేస్తుంది.
దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసేది – పార్లమెంట్
సాధారణ బిల్లును మొదటగా విధాన పరిషత్ లేదా విధాన సభలో ప్రవేశపెట్టవచ్చును.
శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లు పైన విధాన పరిషత్ 3 నెలల లోపు అభిప్రాయాన్ని తెలపాలి.
శాసనసభ 2వ సారి అదే బిల్లును ఆమోదించి విధాన పరిషత్‌కు పంపినట్లయితే 30 రోజుల లోపు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి.
రాష్ట్రంలో ఉభయ సభల మధ్య సాధారణ బిల్లు పైన అభిప్రాయ బేధాలు ఏర్పడినట్లు అయితే ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు.
ఉభయసభల మధ్య సాధారణ బిల్లు పైన అభిప్రాయ బేధాలు ఏర్పడినట్లయితే శాసనసభ నిర్ణయం అమలులోనికి వస్తుంది.
ఆర్థిక బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతితో మొదటగా శాసనసభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి.
శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లును విధాన పరిషత్ 14 రోజుల లోపు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి.
ఉభయసభలు బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపడం జరుగుతుంది.
శాసన సభ పంపిన బిలును గవర్నర్ ఆమోదించవచ్చు లేదా పునపరిశీలనకు పంపవచ్చును.
రెండవసారి శాసనసభ బిలును ఆమోదించి పంపినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి.
213 నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభ సమావేశంలో లేనపుడు ముఖ్యమంత్రి నాయకత్వాన గల కెబినేట్ మంత్రుల లిఖిత పూర్వక సిపారసు మేరకు ఆర్డినెన్లను జారీ చేస్తారు.
ఆర్డినెన్స్ చట్టంగా మారడానికి శాసనసభ సమావేశం అయిన రోజు నుండి 6 వారాలలోపు ఆమోదించాలి.
శాసనసభ ఆమోదించి పంపిన వివాదాస్పదమైన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపి అధికారం గవర్నర్‌కు ఉంది.
2. కార్యనిర్వాహక అధికారాలు
రాష్ట్ర శాసనశాఖలో గల సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, అవిశ్వాస తీర్మాణం ద్వారా మంత్రి మండలిని నియంత్రణ చేస్తుంది.
విధాన పరిషత్, విధాన సభ సభ్యులు ప్రజా సమస్యల పట్ల సభలో ప్రశ్నలను అడుగుతారు.
శాసనసభ సభ్యులు అడిగే నక్షత్రపు గుర్తుగల ప్రశ్నలకు సంబంధిత మంత్రి మౌకిక రూపంలో సమాధానం ఇస్తారు.
నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలకు సంబంధిత మంత్రి లిఖిత రూపంలో సమాధానాలు ఇస్తారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని 1/10వ వంతు సభ్యుల మద్దతుతో శాసనసభలో ప్రవేశపెడతారు.
శాసనసభ సాధారణ మెజార్టీతో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లు అయితే మంత్రి మండలి రద్దు అవుతుంది.
ఒక అవిశ్వాస తీర్మానానికి, మరొక అవిశ్వాస తీర్మానానికి మధ్య కాల వ్యవధి 6 నెలలు ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రణ చేయడానికి విధాన పరిషత్ కంటే విధాన సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి.
3. ఆర్థిక అధికారాలు
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేది గవర్నర్.
రాష్ట్ర ఆర్థిక మంత్రి గవర్నర్ ముందస్తు అనుమతితో బడ్జెట్ ను మొదటగా శాసనసభలోనే ప్రవేశపెట్టాలి.
శాసనసభ ఆమోదించిన బడ్జెట్ ను విధాన పరిషత్ 14 రోజుల లోపు ఆమోదించాలి.
రాష్ట్ర శాసనసభ ఆమోదంతోనే బడ్జెట్ అమలులోకి వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన కొత్త పన్నులను వేయడానికి, అమలులో ఉన్న పన్నులను పెంచడానికి శాసనసభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.
రాష్ట్ర సంఘటిత నిధి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం సంఘటిత నుండి డబ్బులను ఖర్చు పెట్టడానికి శాసనసభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.
రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్ కు సమర్పిస్తుంది.
గవర్నర్ నివేదికను పరిశీలించిన తర్వాత శాసనసభకు పంపుతారు.
రాష్ట్ర శాసన శాఖ వార్షిక నివేదిక పై చర్చిస్తుంది. – రాష్ట్ర బడ్జెట్ గూర్చి వివరించే నిబంధన – 202.
4. న్యాయ అధికారాలు
సుప్రీంకోర్టు, హైకోర్టులు మినహా దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితా పరిధిలో ఉంటాయి.
దిగువ న్యాయస్థానాల యొక్క అధికారాలను శాసన శాఖ నిర్ణయిస్తుంది.
న్యాయమూర్తుల జీతభత్యాలు, అధికార విధులను శాసన శాఖ నిర్ణయిస్తుంది.
5. ఎన్నిక అధికారాలు
ఎన్నికైన శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు.
శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
రాష్ట్ర శాసనశాఖలో గల సభ్యులు వివిధ రకాలైన శాసనసభ కమిటీల సభ్యులను ఎన్నుకుంటారు.
ఉదా: ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల సంఘం మొదలైనవి.