నిరుద్యోగులకు శుభవార్త: SSC నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Harish |
నిరుద్యోగులకు శుభవార్త: SSC నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నటువంటి పలు ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ 'బి' (నాన్ గెజిటెడ్) ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(CPWD), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్(నావికాదళం), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ (FBP), మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (NTRO), ఓడరేవులు, షిప్పింగ్ & మంత్రిత్వ శాఖ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) తదితర సంస్థల్లో అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది.

పోస్ట్ పేరు: జూనియర్ ఇంజనీర్

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)

జూనియర్ ఇంజనీర్ (క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్)

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ ఇంజనీరింగ్.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 ఆగస్టు 2022.

చివరి తేదీ: 2 సెప్టెంబర్ 2022.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 100.

SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03 సెప్టెంబర్ 2022.

పే స్కేల్: రూ. 35,400 – రూ. 1,12,400.

వయస్సు: 30 సంవత్సరాలు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు సడలింపు ఉంది.

ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ https://ssc.nic.in/ లేదా https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/notice_eng_je_12082022.pdf ను చూడగలరు.

Advertisement

Next Story