- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SMP Jobs: శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత, జీతం వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతా(Kolkata)లోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్(SMP) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://smp.smportkolkata.in/smpk/en/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 20 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- అసిస్టెంట్ మేనేజర్ - 10
- అసిస్టెంట్ మేనేజర్ - 01
- సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ - 01
- సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ - 01
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ/ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18-30 ఏళ్లు మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500+జీఎస్టీ , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అభ్యర్థులకు రూ.100+జీఎస్టీ ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 మధ్య జీతం ఉంటుంది.