- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NWR Recruitment: రాత పరీక్ష లేకుండానే నార్త్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు
దిశ,వెబ్డెస్క్: రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్(Jaipur)లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC)- నార్త్ వెస్ట్రన్ రైల్వే(NWR) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వర్క్ షాప్/ యూనిట్లలో 1791 యాక్ట్ అప్రెంటిస్(Act Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.rrcjaipur.in ద్వారా ఆన్లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు(నవంబర్ 10) ప్రారంభమై 10 డిసెంబర్ వరకు కొనసాగనుంది.
పోస్టు పేరు, ఖాళీలు:
యాక్ట్ అప్రెంటిస్ - 1791
విద్యార్హత:
సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు..50 శాతం మార్కులతో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
10 డిసెంబర్ 2024 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.