నవంబర్: కరెంట్ అఫైర్స్

by GSrikanth |
నవంబర్: కరెంట్ అఫైర్స్
X

రాష్ర్టాలు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ) సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టి.విజయ్‌కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు:

సీనియరు పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాల రాజు ఉత్తర్వులు జారీ చేశారు.

పదవిలో ఉన్నంత కాలం ఆయనకు క్యాబినెట్ హోదా వర్తిస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుత ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం నవంబరు 7తో ముగియనుండటంతో ఆయన స్థానంలో కొమ్మినేని బాధ్యతలు చేపడతారు.

గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీ:

ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) అమలుకు కమిటీ నియమించాలని గుజరాత్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న తరుణంలో చివరిదిగా భావిస్తున్న కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన నిర్వహించారు.

దీనిలో తీసుకున్న నిర్ణయాలను రాష్ర్ట మంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ఈ మేరకు వెల్లడించారు.

కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు.

ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటారు.

రాజ్యాంగంలోని 44వ నిబంధన పౌరులందరికీ ఒకే చట్టం అమలు కావాలని పేర్కొంటుంది.

ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ గతంలోనే ప్రకటించాయి.

ఎస్ఈబీకి ప్రత్యేక లోగో:

ఏపీ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు (సెబ్) రాష్ర్ట ప్రభుత్వం అధికారిక లోగో ఖరారు చేసింది.

98 మిల్లీ మీటర్ల పొడవు, 76 మి.మీ వెడల్పుతో ఈ లోగో ఉంటుంది.

ఈ లోగో బ్యాక్ గ్రౌండ్ అంతా జెట్ బ్లాక్ రంగులో ఉంటుంది.

శ్రద్ధ (డిలిజెన్స్), స్వచ్ఛత (కండోర్), శౌర్యం (వలోర్) పదాలతో పాటు సత్యమేవ జయతే నినాదాన్ని ఈ లోగోలో పొందుపరిచారు.

అవార్డులు:

పునీత్ కు కర్ణాటక రత్న అత్యున్నత పురస్కారం:

దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన కర్ణాటక రత్న పురస్కారాన్ని బెంగళూరులోని విధాన సౌధ ప్రాంగణంలో ప్రదానం చేశారు.

కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధానారాయణ మూర్తి, జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా పునీత్ సతీమణి అశ్వనీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ధవళేశ్వరం బ్యారేజీకి ఆస్ర్టేలియా హెరిటేజ్ పురస్కారం:

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీకి ఆస్ర్టేలియా హెరిటేజ్ పురస్కారం లభించింది.

ఈ పురస్కారాన్ని సీడబ్ల్యూసీ సభ్యుడు ఓరా చేతుల మీదుగా రాష్ర్ట జలవనరుల శాఖ ఇంజనీరు ఇన్ చీఫ్ ఆర్.సతీశ్‌కుమార్, డిప్యూటీ ఇంజనీరు ఇన్‌చీఫ్ శివ ప్రసాదరెడ్డి అందుకున్నారు.

ఢిల్లీ‌లో నిర్వహించిన 7వ 'ఇండియా వాటర్ వీక్' కార్యక్రమంలో ఏపీ తరఫున పురస్కారం అందుకున్నారు.

అంతర్జాతీయం

అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్:

ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నలిచింది.

ఈ మేరకు ప్రస్తుత ఏడాదికి గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ గాలప్ విడుదల చేసిన లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ స్పష్టం చేసింది.

ఈ జాబితాలో సింగపూర్ 96 పాయింట్ల స్కోర్ సాధించి ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా అవతరించింది.

తజకిస్థాన్, నార్వే, స్విట్జర్లాండ్, ఇండోనేసియా తరువాత నాలుగు స్థానాల్లో నిలిచాయి.

120 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్ 80 పాయింట్లు సాధించి 60 ర్యాంకులో నిలిచింది.

ఆఫ్ఘనిస్థాన్ ఈ జాబితాలో అత్యంత రక్షణ రహిత దేశంగా నిలిచింది.

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతం:

అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ మూడేళ్ల తర్వాత తొలిసారిగా తన భారీ ఫాల్కన్ హెవీ రాకెట్ ను నింగిలోకి ప్రయోగించింది.

సైనిక ఉపగ్రహాలను భూకక్ష్యలోకి పంపింది.

కేప్ కెనావెరాల్ లోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

రాకెట్ మొదటి దశలోని 27 ఇంజిన్ల గర్జన దాదాపు 5 కి.మీ దూరం వరకూ వినిపించింది.

ఫాల్కన్ హెవీ రాకెట్‌ను తొలిసారి 2018లో ప్రయోగించారు.

2019 లో రెండు సార్లు ప్రయోగించారు.

డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ రాజీనామా:

దిశ, కెరీర్: ఎన్నికల ఫలితాల్లో మిగిలిన వారి కంటే ముందున్నా సర్కారును ఏర్పాటు చేయరాదని డెన్మార్క్ ప్రధాన మంత్రి మెటే ఫ్రెడరిక్సన్ నిర్ణయించుకున్నారు.

సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు వీలుగా ఫ్రెడరిక్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

179 స్థానాలున్న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఒకే ఒక్క స్థానం ఆధిక్యాన్ని సాధించింది.

90 స్థానాలు సాధించినందు వల్ల మైనారిటీ సర్కారుకు అధినేతగా అధికారంలో కొనసాగేందుకు వీలుంది.

సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆమె రాజీనామా చేశారు.

రాజీనామా లేఖను డెన్మార్క్ రాణి మార్ గ్రెతేకు అందించారు.

జాతీయం

ఆర్ ఏఎఫ్ కు తొలిసారి మహిళా ఐజీ అధికారులు:

సిఆర్‌పీఎఫ్ చరిత్రలో తొలిసారి బిహార్‌లోని ఆర్ఏఎఫ్ విభాగానికి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఇద్దరు మహిళా అధికారులను నియమించింది.

3.25 లక్షల మందితో అతిపెద్ద పారామిలటరీ దళంగా పేరుగాంచిన సీఆర్‌పీఎఫ్‌లో మహిళలకు తొలిసారి 1987లో ప్రవేశం కల్పించిన 35 ఏళ్ల తర్వాత వారు ఐజీలుగా ఉన్నత స్థానంలో నియమితులవడం విశేషం.

జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కార్ఫరెన్స్ పార్టీ చీఫ్‌గా సజ్జాద్ గనీ లోన్:

జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక నేత అబ్దుల్ గనీ లోన్ కుమారుడైన సజ్జాద్ గనీ లోన్ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అధ్యక్ష స్థానం ఎన్నికకు ఈ పార్టీ షెడ్యూలు ప్రకటించగా అనంతనాగ్, పూంఛ్, జమ్ము తదితర ప్రాంతాల నుంచి సజ్జాద్‌కు మద్దతుగా 8 నామినేషన్లు దాఖలయ్యాయి.

దీంతో ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.

GST వసూళ్లలో తెలంగాణలో 11శాతం, ఏపీ 24 శాతం వృద్ధి:

అక్టోబరు నెల జీఎస్టీ వసూళ్లలో ఏపీ 24 శాతం, తెలంగాణ లో 11 శాతం, వృద్ధి నమోదైంది.

గతేడాది ఈ నెలలో ఏపీకి రూ. 2,879 కోట్లు..రాగా ఈ సారి అది రూ. 3,579 కోట్లకు చేరింది.

తెలంగాణ ఆదాయం రూ. 3,579 కోట్ల నుంచి రూ. 4,284 కోట్లకు పెరిగింది.

దక్షిణాది రాష్ర్టాల్లో వృద్ధి రేటు వరుసగా పుదుచ్చేరి (34 శాతం), కర్ణాటక (33 శాతం), కేరళ (29 శాతం), తమిళనాడు (25 శాతం), ఏపీ (24 శాతం), తెలంగాణ (11శాతం) నమోదయ్యాయి.

కేంద్ర రక్షణ కార్యదర్శిగా గిరిధర్ అరమణే:

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణే కేంద్ర రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

పదవీ విరమణ చేసిన అజయ్ కుమార్ స్థానంలో గిరిధర్ విధులు నిర్వహించనున్నారు.

1988వ బ్యాచ్ కు చెందిన ఆయన ఇప్పటి వరకూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.

కేంద్ర ప్రభుత్వంలోనూ, ఉమ్మడి ఏపీలోనూ ఆయన కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు.

స్పోర్ట్స్

అండర్ 23 జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో నందినికి స్వర్ణం:

జాతీయ అండర్-23 ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ స్ప్రింటర్ అగసర నందిని అదరగొట్టింది.

మహిళల 100 మీ. హార్డిల్స్ పరుగులో పసిడి సొంతం చేసుకుంది.

13.73 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలవడంతో పాటు కొత్త మీట్ రికార్డు సృష్టించింది.

గతేడాది అపర్ణ (13.80 సె) నెలకొల్పిన టైమింగ్ ను ఇప్పుడు నందిని అధిగమించింది.

ఇకపై మహిళా క్రికెటర్లకు మ్యచ్ ఫీజులు

క్రికెట్లో లింగ అసమానతను తొలగించడంలో భాగంగా బీసీసీఐ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని ఎపెక్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో బీసీసీఐ నిర్ణయించింది.

కేంద్ర కాంట్రాక్టులు పొందిన పురుషులు, మహిళలకు సమాన మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించాడు.

మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా టెస్టుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజుగా అందిస్తారు.

Advertisement

Next Story