- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NICL Jobs: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం పూర్తి వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NICL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 11 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
అసిస్టెంట్(Assistant) - 22
విద్యార్హత:
సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కచ్చితంగా వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
1 సెప్టెంబర్ 2024 నాటికి 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100 ఫీజు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,405 నుంచి రూ.62,265 వరకు జీతం ఉంటుంది.
- Tags
- NICL