New Job Notification: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో.. ఉద్యోగాలు

by Geesa Chandu |   ( Updated:2024-09-25 10:51:31.0  )
New Job Notification: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో.. ఉద్యోగాలు
X

దిశ, వెబ్ డెస్క్: రక్షణ శాఖ(Defense) పరిధిలోని ఆర్మ్ డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్(Armoured Vehicles Nigam Limited) కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్(Ordnance Factory Medak)(OFMK)లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన.. ప్రాజెక్ట్ ఇంజినీర్(Project Engineer) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్(Applications) ను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 31

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్యాడ్ స్పెషలిస్ట్, మెటలర్జీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,000. ఉంటుంది.

వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన తేదీ(సెప్టెంబర్ 21, 2024) నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఆఫ్ లైన్ లో దరఖాస్తు: దరఖాస్తుల(Applications)ను.. ది డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్ ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దు మైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ చిరునామాకు పంపవలసి ఉంటుంది.

ఇతర వివరాలకు వెబ్ సైట్: https://avnl.co.in/

Advertisement

Next Story

Most Viewed