సౌత్ సెంట్రల్ రైల్వేలో జేటీఏ పోస్టులు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక !

by Seetharam |
సౌత్ సెంట్రల్ రైల్వేలో జేటీఏ పోస్టులు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక !
X

దిశ,వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులు భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.

పోస్టుల వివరాలు :

జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్/డ్రాయింగ్) - 35 పోస్టులు

అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ/ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి

అడ్రస్: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెక్రటరీ టు ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజనీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ నిలయం, ఎస్‌సీఆర్, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.

చివరితేదీ: జూన్ 30, 2023.

వెబ్‌సైట్: https://scr.indianrailways.gov.in/

Advertisement

Next Story