ESIC న్యూఢిల్లీలో ఉద్యోగాలు..భారీగా వేతనం, త్వరపడండి..

by Kavitha |
ESIC న్యూఢిల్లీలో ఉద్యోగాలు..భారీగా వేతనం, త్వరపడండి..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లొ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంద. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య:93

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 12

*ఇందులో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ Gr-II, సూపరింటెండెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఏప్రిల్ 12 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం చెల్లిస్తారు.

*దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.esic.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Advertisement

Next Story