- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 240 అప్రెంటీస్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(TG)ల్లో ఖాళీగా ఉన్న 240 అప్రెంటీస్(Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/apprenticeships ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 29 నవంబర్ 2024. డిసెంబర్ 6న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. డిసెంబర్ 18 నుంచి 20 మధ్య సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
పోస్టు పేరు, ఖాళీలు:
- మెకానికల్ ఇంజనీరింగ్ - 20
- సివిల్ ఇంజనీరింగ్ - 20
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 20
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 20
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 20
- ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ - 20
- నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ - 120
విద్యార్హత:
సంబంధిత విభాగంలో 2020 నుంచి 2024 మధ్య డిప్లొమా లేదా బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్ :
నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులకు నెలకు రూ.11,500, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.10,500 స్టైఫండ్ చెల్లిస్తారు.