ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP)లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు

by Harish |   ( Updated:2022-08-24 09:41:54.0  )
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP)లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) Level-6 పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం పోస్ట్‌లు: 18

పోస్ట్ పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్(స్టాఫ్ నర్స్)

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఇంటర్మీడియట్ సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయబడిన జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ పరీక్షలో ఉత్తీర్ణత. నర్సింగ్ విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం.

వయస్సు: 21 నుంచి 30 సంవత్సరాలు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 ఆగస్టు 2022.

చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2022.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 200.

SC/ST/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

పే స్కేల్: రూ. 35,400 – రూ.1,12,400.

ఎంపిక విధానం: PET, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ https://www.itbpolice.nic.in/index.html లేదా file:///C:/Users/pmpl/Downloads/192.pdf ను చూడగలరు.

Advertisement

Next Story