- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ పాలిటీ: స్టేట్ గవర్నమెంట్
స్టడీ మెటీరియల్: రాష్ట్ర శాసన శాఖ గురించి 168-212 వరకు తెలియజేసే నిబంధనలు రాజ్యాంగంలోని 6వ భాగంలో ఉంది. 68వ నిబంధన ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర శాసన శాఖ ఉంటుంది. రాష్ట్ర శాసన శాఖ అనగా విధాన పరిషత్, విధాన సభ, గవర్నర్ అని అర్థం.
రాష్ట్ర శాసనశాఖలో గవర్నర్ అంతర్భాగం
ఎగువ సభ – విధాన పరిషత్
దిగువ సభ – విధాన సభగా పిలుస్తారు.
రాజ్యాంగం ప్రకారం శాసన శాఖలో సభ్యత్వం లేకుండా సమావేశాలకు హాజరయ్యే ఏకైక వ్యక్తి – అడ్వకేట్ జనరల్.
అడ్వకేట్ జనరల్ శాసనశాఖలో బిల్లుపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనకూడదు.
సభలో జరిగే చర్చలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆర్థిక విషయాల్లో విధానసభకు ఎక్కువ అధికారాలు, విధాన పరిషత్‌కు తక్కువ అధికారాలు ఉంటాయి.
విధాన పరిషతను విధాన మండలిగా, విధాన సభను శాసన సభగా పిలుస్తారు.
ప్రతిపక్ష నాయకుడు..
ప్రతిపక్ష నాయకులకు రాష్ట్ర కేబినెట్ మంత్రితో సమానమైన హోదా, గౌరవం ఉంటుంది.
ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందడానికి కనీసం 1/10వ వంతు సభ్యుల మద్దతు ఉండాలి.
శాసనసభ సమావేశం జరగడానికి కనీసం 1/10వ వంతు సభ్యులు హాజరు కావాలి.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసన శాఖ సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి.
2 సమావేశాల మధ్య కాల వ్యవధి – 6 నెలలు ఉండాలి.
సాధారణంగా రాష్ట్ర శాసన శాఖ సంవత్సరానికి 3 సార్లు సమావేశమవుతుంది.
అవి:
1) బడ్జెట్ సమావేశాలు (Budget Session)
2) వర్షాకాల సమావేశాలు (Monsoon Session)
3) శీతాకాల సమావేశాలు (Winter Session)
రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాలకు గరిష్ట సంఖ్య లేదు.
సంవత్సరానికి ఎన్నిసార్లు అయినా శాసనసభ సమావేశాలు జరగవచ్చును.
ఎక్కువ రోజులు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
తక్కువ రోజులు వర్షాకాలం సమావేశాలు జరుగుతాయి.
విధాన పరిషత్/విధాన మండలి..
విధాన పరిషత్ గూర్చి వివరించే నిబంధన – 171
169వ నిబంధన ప్రకారం పార్లమెంట్ సాధారణ మెజార్టీతో విధాన పరిషత్‌ను ఏర్పాటు లేదా రద్దు చేస్తుంది.
రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించి సిపారసు చేసినట్లయితే పార్లమెంట్ సాధారణ మెజార్టీతో ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానం అమలులో ఉంది.
(1) ఉత్తరప్రదేశ్ – 100, (2) మహారాష్ట్ర – 78, (3) బీహార్ – 75, (4) కర్ణాటక – 75, (5) ఆంధ్రప్రదేశ్ – 58, (6) తెలంగాణ – 40 అతి త్వరలో విధాన పరిషత్ రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్నాయి.
రాజ్యాంగ ప్రకారం విధాన పరిషత్ కనీస సభ్యుల సంఖ్య – 40 మంది.
రాజ్యాంగ ప్రకారం విధాన పరిషత్ గరిష్ట సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల మొత్తంలో 1/3వ వంతుకు మించి ఉండకూడదు.
171వ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ 1/6 వ వంతు సభ్యులను విధానపరిషత్‌కు నియమిస్తారు.
కలలు, సాహిత్యం, సమాజ సేవ, శాస్త్ర సాంకేతిక, ఇతర రంగాల్లో అనుభవం గల వారిని గవర్నర్ నామినేట్ చేస్తారు.
అర్హతలు..
భారతీయ పౌరుడై ఉండాలి.
కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండి ఉండాలి.
లాభదాయకమైన పదవి ఉండరాదు.
ఎస్సీ, ఎస్టీలు 5,000. ఇతరులు 10,000 రూ.లను డిపాజిట్ చేయాలి.
ఎన్నిక విధానం..
విధాన పరిషత్ ఎన్నికలను నిర్వహించేది – భారత ఎన్నికల సంఘం.
విధాన పరిషత్ సభ్యులను ఈ క్రింది వారు ఎన్నుకుంటారు.
శాసనసభ సభ్యులు 1/3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
స్థానిక సంస్థలు 1/3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
ఉపాధ్యాయులు 1/12వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
పట్టభద్రులు 1/12వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. (కళలు, సాహిత్యం , సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, ఇతర రంగాల్లో అనుభవం గలవారు)
విధాన పరిషత్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – చైర్మన్.
విధాన పరిషత్ శాశ్వతమైనది కాదు.
పార్లమెంట్ సాధారణ మెజార్టీతో విధాన పరిషత్‌ను రద్దు చేస్తుంది.
పదవీ కాలం..
విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
కొత్తగా విధాన పరిషత్ ఏర్పడినప్పుడు 2 సంవత్సరాలకు లాటరీ పద్ధతి ద్వారా 1/3వ వంతు సభ్యులను నిర్ణయిస్తారు.
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సమక్షంలో లాటరీ పద్ధతిని నిర్వహిస్తారు.
పదవి విరమణ చేసిన వారు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవవచ్చు.
విధానపరిషత్ సభ్యులు తమ రాజీనామా లేఖను చైర్మన్‌కు ఇవ్వాలి.
ఏ కారణం చేతనైనా సభ్యుని పదవి ఖాళీ అయితే 6 నెలలలోపు భర్తీ చేయాలి.
విధాన పరిషత్ ఎన్నికల్లో నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది.
విధాన పరిషత్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం చైర్మన్‌కు ఉంటుంది.
చైర్మన్( Chairman)..
విధాన పరిషత్‌కు అధిపతి – చైర్మన్
విధాన పరిషత్ చైర్మన్‌కు రాష్ట్ర కేబినెట్ మంత్రి కంటే ఎక్కువ సదా, గౌరవం ఉంటుంది.
సాధారణంగా చైర్మన్ అధికార పార్టీకి, డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందివుంటారు.
రాజ్యాంగ ప్రకారం విధానపరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్‌గా.. మరొకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు వర్తించకుండా ఉండటానికి పదవిని చేపట్టిన వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
విధాన పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించేది ప్రొటెం చైర్మన్ / తాత్కాలిక చైర్మన్.
ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ తాత్కాలిక చైర్మన్/ ప్రొటెం చైర్మన్ ను నియమిస్తారు.
ప్రొటెం చైర్మన్ కు 2 అధికారాలు ఉంటాయి. 1. తొలి సమావేశానికి అధ్యక్షత వహించి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం.2. చైర్మన్ ఎన్నికను నిర్వహించడం.
ఎన్నిక విధానం..
విధాన పరిషత్ చైర్మన్ ఎన్నికను నిర్వహించేది – ప్రొటెం చైర్మన్
విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
రాజ్యాంగ ప్రకారం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు ప్రమాణ స్వీకారం ఉండదు.
సాంప్రదాయకంగా విధాన పరిషత్ లో గల అధికార పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు గౌరవంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను పదవి వద్దకు తీసుకు వస్తారు.
పదవీ కాలం..
చైర్మన్ పదవీ కాలం – 6 సంవత్సరాలు.
చైర్మన్ తన రాజీనామా లేఖను డిప్యూటీ చైర్మన్‌కు ఇవ్వాలి.
ఏ కారణం చేతనైనా చైర్మన్ పదవి ఖాళీ అయితే 6 నెలల లోపు భర్తీ చేయాలి.
చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు డిప్యూటీ చైర్మన్ 6 నెలలకు మించకుండా తాత్కాలిక చైర్మన్‌గా విధులను నిర్వహిస్తారు.
అధికార దుర్వినియోగం అవినీతికి పాల్పడినప్పుడు చైర్మన్ కు వ్యతిరేఖంగా 14 రోజుల ముందస్తు నోటీసుతో అవిశ్వాస తీర్మానాన్ని విధాన పరిషత్ లో ప్రవేశపెట్టవచ్చును.
అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగే రోజు నాడు చైర్మన్ అధ్యక్ష స్థానంలో ఉండకూడదు.
అవిశ్వాస తీర్మాణంపై జరిగే ఓటింగ్‌లో చైర్మన్ పాల్గొనవచ్చును.
విధాన పరిషత్ అవిశ్వాస తీర్మానాన్ని 2/3వ వంతు మెజార్టీతో ఆమోదించినట్లయితే చైర్మన్ పదవి నుండి తొలగించబడతారు.
అధికారాలు – విధులు (Powers and Functions)
విధాన పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించి ప్రశాంతంగా నిర్వహించాలి.
విధాన పరిషత్‌లో సభ్యులకు సీట్లను కేటాయించడం, గ్రంథాలయ వసతిని కల్పిస్తారు.
విధాన పరిషత్ నిర్ణయాలను అధికారికంగా ప్రకటిస్తారు.
విధాన పరిషత్ నియమాలను ఉల్లంఘించిన సభ్యులను సస్పెండ్ చేస్తారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల సభా సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
ఏ సభ్యుడైనా చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సమావేశానికి హాజరుకానట్లయితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
విధాన పరిషత్ లో బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా, వ్యతిరేంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు చైర్మన్ ఓటింగ్‌లో పాల్గొంటారు.
చైర్మన్ ఓటును నిర్ణయకపు ఓటు అంటారు.
విధాన పరిషత్ లో జరిగే చర్చలను రికార్డు చేసి భద్రపరుస్తారు.
విధాన పరిషత్‌లో పనిచేసే సిబ్బందిని నియంత్రణ చేస్తారు.
విధాన పరిషత్ ఆమోదించిన తీర్మానం పైన చైర్మన్ సంతకం చేసి విధాన సభకు పంపుతారు.
సభ్యులు ప్రవేశపెట్టే బిల్లును సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లుగా నిర్ణయిస్తారు.
సభ్యులు అడిగే ప్రశ్నలను నక్షత్రపు గుర్తు గల ప్రశ్నలుగా, నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలుగా నిర్ణయిస్తారు.