ప్రసార భారతిలో.. 70 కొలువులకు నోటిఫికేషన్ జారీ!

by Geesa Chandu |   ( Updated:2024-09-11 12:11:30.0  )
ప్రసార భారతిలో.. 70 కొలువులకు నోటిఫికేషన్ జారీ!
X

దిశ, వెబ్ డెస్క్: న్యూఢిల్లీలోని ప్రసార భారతి.. దూరదర్శన్ కేంద్రంలోని వార్తా విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 70 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

అర్హత: పోస్టును బట్టి డిప్లొమా/డిగ్రీ(రేడియో/ టెలికమ్యూనికేషన్ /ఎలక్ట్రికల్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) తో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి. ఆకాశవాణి, దూరదర్శన్ లో అప్రెంటిస్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ. 40,000.

పని ప్రదేశాలు: దూరదర్శన్ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రం(ఢిల్లీ).

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు: నోటిఫికేషన్ వెలువడిన తేదీ(29.8.2024) నుంచి 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలసి ఉంటుంది.

వెబ్ సైట్: https://prasarbharati.gov.in/pbvacancies/

Advertisement

Next Story