- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుంచి భారీ నోటిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) అండ్ హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1312 పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేయాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం పోస్ట్‌లు : 1312
పోస్ట్ పేరు:
1. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) - 982
2. హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) - 330
అర్హత:
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 10వ తరగతి/ITI, రేడియో & టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ ఆపరేటర్/జనరల్ ఎలక్ట్రానిక్స్/డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): రేడియో అండ్ టెలివిజన్/ఎలక్ట్రానిక్స్/ఫిట్టర్/10 ఉత్తీర్ణత/ITI సర్టిఫికేట్/కంప్యూటర్ సాఫ్ట్‌వేర్/ జనరల్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ హార్డ్‌వేర్/నెట్‌వర్క్ టెక్నీషియన్/డేటా ఎంట్రీ ఆపరేటర్/ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 12వ ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 25,500 – రూ. 81,100.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఆగస్టు 2022.
చివరి తేదీ: 19 సెప్టెంబర్ 2022.
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాలు.
రిజర్వేషన్ కేటగిరి వారికి వయసు సడలింపు ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ (PST) అండ్ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఆధారంగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 100
SC/ST/Ex-S అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ https://bsf.gov.in/ లేదా http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_19110_57_2223b.p ను చూడగలరు.