- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CRPF కానిస్టేబుల్ జాబ్ సాధించండిలా!
దిశ, కెరీర్: దేశవ్యాప్తంగా 9212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలీసు ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు నోటిఫికేషన్లకు ఎలాగూ సిద్ధమవుతున్నారు. అదే సన్నద్ధతతో ఈ పోస్టులకు కూడా పోటీ పడవచ్చు. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్షలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కానిస్టేబుల్ ఎంపికలాగానే.. కొద్దిపాటు మార్పులతోనే ఉండటం వలన అభ్యర్థులు ఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకుని ప్రయత్నం చేయవచ్చు. స్టేట్ పోస్టులతో పాటు ఈ పోలీసు ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చింతంగా పోలీసు కొలువు కొట్టొచ్చు. పదో తరగతి/ఐటీఐ త్తీర్ణులైన పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 27, 2023
చివరితేదీ: ఏప్రిల్ 25, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు: జులై 1, 2023 నుంచి జులై 13, 2023 వరకు.
వెబ్‌సైట్: www.crpf.gov.in
మొత్తం పోస్టులు : 9212
మొత్తం 9212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) ఖాళీల్లో పురుషులకు 9105 పోస్టులు, మహిళలకు 107 పోస్టులు కేటాయించారు. ఈ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ లో 424 పురుష అభ్యర్థులకు, తెలంగాణలో 301 పురుషులకు కేటాయించారు. మహిళలకు ఏపీలో 04, తెలంగాణలో 06 పోస్టులున్నాయి.
ఎంపిక ఎలాగంటే..?
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ , ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయసు:
ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు దరఖస్తుకు అర్హులు. కానిస్టేబుల్ /డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు వర్తిస్థుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ. 100 ఆన్‌లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ, మహిళా, ఎక్స్ - సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవరసం లేదు.
నోట్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దివ్యాంగులు అనర్హులు.
అర్హతలు ఇవే:
కానిస్టేబుల్ /డ్రైవర్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రిక్రూట్‌మెంట్ సమయంలో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ పాసవ్వాలి.
మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులకు పదో తరగతి పాసవ్వాలి. మెకానిక్ మోటార్ వెహికల్ లో రెండేళ్ల ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ లో ..మూడేళ్ల జాతీయ లేదా రాష్ట్ర అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ ఉండాలి.
ఇతర ట్రేడ్స్ మెన్ పోస్టులకు పదోతరగతి పాసవ్వాలి. సంబంధిత విభాగాల్లో పనిచేసిన నైపుణ్యం ఉండాలి.
మేసన్ /ప్లంబర్ / ఎలక్ట్రీషియన్ పోస్టులకు పదోతరగతి పాసవ్వాలి. సంబంధిత విభాగాల్లో ఏడాది అనుభవం ఉండాలి. ఐటిఐ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ):
రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీఎస్ టీ /పీఈటీ /ట్రేడ్ టెస్టులకు ఎంపిక చేస్తారు.
పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ ఉండాలి. మహిళలకు ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ ఉండాలి, మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం.మీ ఉండాలి.
పురుష అభ్యర్థుల ఛాతీ సైజు 80 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుుడు 5 సెం.మీ వ్యాకోచించాలి.
ఎస్టీ అభ్యర్థుల ఛాతీ సైజు 76 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ వ్యాకోచించాలి.
రాత పరీక్షలో ఎంపికైన ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు పీఎస్‌టీ/పీఈటీలో పూర్తి సడలింపు ఉంటుంది. ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ పోటీ పడి ఎంపికవ్వాలి.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ):
కానిస్టేబుల్ /డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, గార్డెనర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, కోబ్లర్, టైలర్ అండ్ బగ్లర్ విభాగాలకు చెందిన పురుష అభ్యర్థులు 5 కి.మీల పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ దూరాన్ని8.30ని పూర్తి చేయాలి.
కానిస్టేబుల్/కుక్, వాటర్ క్యారియర్, బార్బర్ అండ్ హెయిర్ డ్రస్సర్, వాషర్ మ్యాన్ అండ్ వాషర్ ఉమెన్, సఫాయి కర్మచారి విభాగాలకు చెందిన పురుష అభ్యర్థులు 1.6 కి.మీ దూరాన్ని 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులైతే 1.6 కి.మీ దూరాన్ని 12 నిమిషాల్లో ముగించాలి. పరుగులో అర్హత సాధించలేని అభ్యర్థులను నియామక ప్రక్రియ నుంచి తొలగిస్తారు.
ట్రేడ్ టెస్ట్:
సీబీటీ, పీఎస్‌టీ, పీఈటీలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. అభ్యర్థులు 20 మార్కులు సాధించాలి. సంబంధిత విభాగాల్లో అభ్యర్థులకు ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఈ టెస్ట్ లో అర్హత సాధిస్తే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. పరీక్షతేదీ, కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని సీఆర్ పీఎఫ్ వెబ్‌సైట్‌లోని అడ్మిట్ కార్డ్ ద్వారా తెలియజేస్తారు. సీబీటీలో అడిగే ప్రశ్నలన్నీ మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: (సీబీటీ): పరీక్ష వ్యవధి 2 గంటలు.
అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలుంటాయి.
పార్ట్-ఎలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజినింగ్ 25 మార్కులు.
పార్ట్-బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్ 25 మార్కులుంటాయి.
పార్ట్-సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కు 25 మార్కులుంటాయి.
పార్ట్ -డిలో ఇంగ్లిష్/హిందీ భాషకు 25 మార్కులు ఉంటాయి.
ఇంగ్లిష్ /హిందీ: వీటిలో భాషపైన అభ్యర్థికి ఉండే పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
సిలబస్ టాపిక్స్:
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్:
నాన్ వెర్బల్ నుంచి ప్రశ్నలుంటాయి. అవి
అనాలిసిస్
సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్
స్పెషియల్ విజువలైజేషన్
స్పెషియల్ ఓరియంటేషన్
విజువల్ మెమరీ
డిస్ క్రిమినేషన్
అబ్జర్వేషన్
రిలేషన్ షిస్ కాన్సెప్ట్స్
అర్థమెటికల్ రీజనింగ్
ఫిగరల్ క్లాసిఫికేషన్
అర్థమెటిక్ నంబర్ సిరీస్
నాన్ వెర్బల్ సిరీస్
కోడింగ్ అండ్ డీకోడింగ్
జనరల్ నాడెట్జ్ & జనరల్ అవేర్‌నెస్ :
పర్యావరణాంశాలు
వర్తమానాంశాలు
క్రీడలు
చరిత్ర సంసృతి
జాగ్రఫీ
ఎకనమిక్ సైన్స్
జనరల్ పాలసీ
భారత రాజ్యాంగం
సైంటిఫిక్ రిసెర్చ్
ఇతరాంశాలు
ఎలిమెంటరీ మ్యాథ్స్:
నంబర్ సిస్టమ్స్
కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్
డిసిమల్స్ అండ్ ఫ్యాక్షన్స్ అండ్ రిలేషన్ షిప్స్
ఫండమెంటల్ అరిథ్ మెటికల్ ఆపరేషన్స్
పర్సంటేజెస్
రేషియో అండ్ ప్రపోర్షన్
యావరేజెస్
ఇంటరెస్ట్
ప్రాఫిట్ అండ్ లాస్
డిస్కౌంట్
మెన్సురేషన్
టైమ్ అండ్ డిస్టెన్స్
రేషియో అండ్ టైమ్
టైమ్ అండ్ వర్క్