జనరల్ నాలెడ్జ్ (GK): నదీ వ్యవస్థ

by Hajipasha |
జనరల్ నాలెడ్జ్ (GK): నదీ వ్యవస్థ
X

సింధు నది (ఇండస్ నది)

* ఇది టిబెట్‌లోని కైలాస్ వరుసలో మానస సరోవరం వద్ద పుట్టింది.

* అక్కడి నుండి పశ్చిమానికి ప్రవహించి, జమ్మూ-కాశ్మీర్‌ని దాటి.. పాకిస్థాన్‌లో ప్రయాణించి తర్వాత అరేబియా సముద్రంలో కరాచీ వద్ద కలుస్తుంది.

* ఈ నది మొత్తం పొడవు - 2880 km

ఇందులో మన దేశంలో జమ్మూ కాశ్మీర్‌లో 709km ప్రయాణిస్తుంది.

* ఈ సింధూనది జమ్మూ కాశ్మీర్‌లో నంగ ప్రభాత్ పర్వతాన్ని తాకుతూ వెళ్తుంది.

* ఈ సింధు నదికి కుడి వైపున ఉన్న ఉపనదులు వరుసగా

1. జీలం

2. చీనాబ్.

3. రావి.

4. బియాస్

6. సట్లేజ్

1. జీలం నది:

* ఇది జమ్మూ - కాశ్మీర్‌లో పిర్‌పంజాల్ వరుసలో పుట్టి పశ్చిమానికి వెళ్ళి

పాకిస్తాన్‌లో సింధూలో కలిసింది.

2. చీనాబ్ నది:

* ఇది హిమాచల్ ప్రదేశ్‌లో బారాలాచా లా కనుమల్లో పుట్టి పాకిస్తాన్

సింధూ నదిలో కలిసింది.

ఇది సింధు ఉపనదుల్లో కెల్లా పెద్ద ఉపనది

3. రావి నది:

* ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కులూ కనుమలులో పుట్టి పాకిస్తాన్‌లో లాహోర్ నగరం గుండా ప్రయాణించి, సింధూ నదిలో కలుస్తుంది.

* అందువల్ల రావి నదిని లాహోర్ నది అని కూడా అంటారు.

4. బియాస్ నది:

* ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కులూ కనుమలో పుట్టి.. ఇది పాకిస్తాన్ గుండా వెళ్ళని సింధూ ఉపనది.

* ఇది సట్లేజ్ నదిలో పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో హరికే అనే ప్రాంతంలో కలుస్తుంది.

5. సట్లెజ్ నది:

* ఇది మన దేశంలో పుట్టని సింధు ఉపనది.

* టిబెట్‌లోని కైలాస్ శ్రేణిలో లోయ వద్ద పుట్టి మన దేశం గుండా వెళ్తూ.. బియాస్ నదిని కలుపుకొని పాకిస్తాన్‌లోకి వెళ్ళింది.

* సట్లెజ్ నది సింధు ఉపనదుల్లో కెల్లా పొడవైన ఉపనది.

బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ:

* ఇది కూడా టిబెట్ కైలాస్ శ్రేణిలో మానస సరోవరానికి దగ్గర్లో ఉన్న చమయంగ్ డాంగ్మ్ అనే ప్రాంతంలో పుట్టి తూర్పుకు ప్రవహించుకుంటూ వెళ్ళి.. మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రెండు రాష్ట్రాలు దాటిన తర్వాత బంగ్లాదేశ్‌లోకి ప్రవేసిస్తుంది.

* ఈ నది మొత్తం పొడవు - 2900km.

* ఇందులో మన దేశంలో రెండు రాష్ట్రాల్లో 885 km ప్రయాణిస్తుంది.

ఈ నది బంగ్లాదేశ్ లో ప్రవేశించగానే జమున నదిగా పిలువబడుతుంది.

పద్మానదితో కలిసిన తర్వాత మేఘన నదిగా పిలువబడుతుంది..

బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లు:

టిబెట్‌లో- యార్లాంగ్ త్సాంగ్‌పో (టిబెట్ భాషలో శుద్ధి చేసేవాడు అని అర్థం.

అరుణాచల్‌ప్రదేశ్- దిహంగ్

అసోం- సైడంగ్

బంగ్లాదేశ్- జమున (పద్మా నదితో కలవక ముందు)

బంగ్లాదేశ్‌లో గంగానది (పద్మానది)తో కలిసిన తర్వాత (రెండింటినీ కలిపి)- మేఘన

చైనా- యార్లాంగ్ జాంగ్‌బో జియాన్‌జిన్

ఇండియా- రెడ్ రివర్

బ్రహ్మపుత్ర ఉపనదులు:

బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కలిసే ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్‌సిరి, ధరణ్‌సిరి, సుభనసిరి

దక్షిణం వైపు నుంచి కలిసే ఉపనదులు: దిబ్రూ, డిక్కు, దిహంగ్

పర్వతీయ నది: రాగాత్సాంగ్‌పో

బ్రహ్మపుత్ర నదికి అసోం దుఃఖదాయని అనే పేరు ఉంది. (ఇది దిశను మార్చుకుని భయంకర వరదతో ప్రవహిస్తుంది)

బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైనది.

ఈ నది అసోంలో మాజోలి అనే ద్వీపాన్ని ఏర్పర్చింది. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ.

ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం.

ఈ నది పరీవాహక ప్రాంతంలోని జోర్హాట్ జిల్లాలో కజిరంగా నేషనల్ పార్క్ (1905 – 2005 వందేండ్లు పూర్తి) ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి.

బ్రహ్మపుత్ర నది S ఆకారంలో ప్రవహిస్తుంది.

- చిత్ర ఆనంద్ కుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

Advertisement

Next Story