బీఎస్సీ నర్సింగ్ లో రెండు పరీక్షలు.. ఐఎన్​సీ ఆదేశాలు

by Javid Pasha |
బీఎస్సీ నర్సింగ్ లో రెండు పరీక్షలు.. ఐఎన్​సీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరడానికి ఎంసెట్‌, నీట్ రెండూ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లోని సీట్లను, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంక్ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లను మాత్రం నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొంది. విద్యార్థులు ఇందుకు అనుగుణంగా రెండు ఎగ్జామ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

కన్వీనర్ కోటా సీట్లను కూడా ఈసారి నీట్ ర్యాంక్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉండగా, ఇటీవల ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నీట్‌కు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నిర్వహించుకోవాలని సూచించింది. ఐఎన్‌సీ ఆదేశాలకు అనుగుణంగా పరీక్షను నిర్వహిస్తామని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story